|
జేబున్నిసా - ఐదు అంకాల నాటకం
పింగళి నాగేంద్రరావుగారు వ్రాసిన నాటకాల్లో " జేబున్నీసా " అనే ఐదు అంకాల నాటకం ఇక్కడ చూడవచ్చు. కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశమేమాత్రమూ లేదనీ, ఆయన రచనా వైదుష్యానికి నీరాజనాలు అర్పిస్తూ ఇక్కడ ప్రచురించడం జరిగిందని తెలియచేసుకుంటున్నాను. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియపర్చవలసిందిగా విన్నపం. తెలియపరచిన వెంటనే ఈ ప్రతి ఇక్కడినుంచి తొలగించబడుతుంది అని తెలియచేసుకుంటున్నాను. మాగంటి వంశీ మోహన్ పింగళివారు ఈ రూపకం ఉపోద్ఘాతంలో చెప్పిన మాటలు. - "హిందూ మతానికి అన్యులవలన విఘాతము కల్గుచున్నప్పుడు తద్ధర్మరక్షణార్ధమై ఖడ్గధరుడైన శివాజిని జేబున్నిసా అభిమానించినది. ఆంతర్యమున మోహించినది. కాని తన ప్రేమను బహిరంగపరుపలేదు. తన కామనతృప్తికై స్వమత ధర్మములను ధిక్కరింపలేదు. శివాజి ఢిల్లిలో ఖైదీయైనప్పుడు " ఒక ధర్మోద్ధారకుడు ప్రపంచమునకు కాకుండ పోవుచుండెనే " అని పరితపించి అతనిని ఉపాయమున చెఱనుండి విడిపించినది. తాను శాశ్వతబ్రహ్మచారిణియై ధర్మారాధనము సల్పినది. ధర్మమూర్తినుపాసించి తరించినది." ఈ విషయమునే కథాపోషణకై వలయు స్వల్పపరికల్పనముల నీరూపకముగ వేగ రచించితిని. ఇందలి రోషనారాది పాత్రలు నాటకప్రయోజనము నర్థించి స్వతంత్రముగ దెచ్చికొనినవి " |